Hyderabad, Nov 22: టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ (Ram Charan) పై అయ్యప్ప స్వాములు ఫిర్యాదు చేశారు. అయ్యప్ప దీక్షలో ఉండి చరణ్ కడప దర్గాను దర్శించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మాలధారణ దుస్తుల్లో ఉన్న రామ్ చరణ్ కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొనడం ఏంటని ఆయనపై పలువురు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో, రామ్ చరణ్ పై శంషాబాద్ లో అయ్యప్పస్వాములు, శంషాబాద్ అయ్యప్పస్వామి సొసైటీ సభ్యులు (Complaint Against Ramcharan) ఎయిర్ పోర్టు పీఎస్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో ఏమన్నారంటే?
రామ్ చరణ్ తన చర్యల ద్వారా అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అయ్యప్పస్వాములు ఫిర్యాదులో డిమాండ్ చేశారు. కాగా, ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.