Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఐదు రోజుల వరకు వానలు.. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం.. హైదరాబాద్, విజయవాడలో శుక్రవారం దంచికొట్టిన వాన
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 15 వరకు వానలు కురుస్తాయని తెలిపింది.
Hyderabad, May 11: ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 15 వరకు వానలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని (Telangana) పలు ప్రాంతాల్లో నిన్న ఓ మోస్తరు వాన కురిసింది. మెదక్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు కురిశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్ల వాన పడింది. అటు హైదరాబాద్ లోనూ వాన కురిసింది. దక్షిణ కేరళ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణతో పాటు ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
బెజవాడను కుదిపేసిన వాన
ఏపీలోని (Andhrapradesh) విజయవాడలో నిన్న భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది.
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు, జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని ఆదేశాలు