Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. పూర్తి వివరాలు ఇవిగో..!
దీంతో తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ గండం పొంచివున్నట్టు వెల్లడించింది.
Hyderabad, Oct 14: ఆగ్నేయ బంగాళాఖాతంలో (Bay Of Bengal) కొనసాగుతున్న అల్పపీడనం నేడు మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలకు (Telugu States) తుఫాన్ గండం పొంచివున్నట్టు వెల్లడించింది. ఈ తుఫాన్ ఎల్లుండి తీరం దాటుతుందని హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణలోనూ ఈ తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
షాకింగ్ వీడియో ఇదిగో, అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా కిటికీ లోంచి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ