Bhatti Reacted Demolition Of Hydra: ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేప‌డితే కూల్చివేయ‌రా? హైడ్రా కూల్చివేత‌ల‌ను స‌మ‌ర్ధించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

హైదరాబాద్‌ అంటే లేక్స్‌, రాక్స్‌కు నెలవని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు

Mallu Bhatti Vikramarka (photo-Video Grab)

Hyderabad, AUG 24: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల (N Convention) వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Cm Bhatti Vikramarka) శనివారం స్పందించారు. హైదరాబాద్‌ అంటే లేక్స్‌, రాక్స్‌కు నెలవని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. చెరువులు ఏవీ ఆక్రమణకు గురవకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా (Hydra) అని తెలిపారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. బఫర్‌ జోన్‌లో కాదు.. నేరుగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని.. వాటిని కూల్చేస్తున్నారని భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు.

Ranganath On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, చట్టప్రకారమే కూల్చివేతలని కామెంట్,కేటీఆర్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ 

శాటిలైట్ ఫొటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత పదేళ్లలో చెరువులు ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయని తెలుసుకుంటున్నామన్నారు. రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్ ఫొటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడుతామన్నారు. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.



సంబంధిత వార్తలు

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Harish Rao: విద్యా హక్కు చట్టం దుర్వినియోగం, సమగ్ర కుటుంబ సర్వే నుండి టీచర్స్‌ను మినహాయించండి..సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు డిమాండ్

KTR: గుట్టలను మట్టి చేసి భూదాహం తీర్చుకోవడం కాదు..ధాన్యం రాశుల వైపు చూడాలని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్, కాసుల కక్కుర్తి కాదు..రైతు బతుకు వైపు చూడాలని సవాల్

SC on Private Properties: ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు