100 % Voting in TS Villages: ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటి చెప్పిన తెలంగాణ పల్లెలు.. జగిత్యాల జిల్లా చిన్నకొల్వాయిలో, మెదక్ జిల్లా సంగాయిపేట తండాలో వంద శాతం పోలింగ్
లోక్ సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది.
Hyderabad, May 14: తెలంగాణలోని (Telangana) రెండు గ్రామాలు (Villages) ప్రజాస్వామ్య స్పూర్తిని చాటి చెప్పాయి. లోక్ సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం చిన్నకొల్వాయిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. గ్రామంలో 110 మంది ఓటర్లు ఉండగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. అలాగే మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో కూడా 100 శాతం పోలింగ్ నమోదైంది. ఈ తండాలో 210 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.