Wind Storms Hits Telangana: తెలంగాణలో గాలివాన బీభత్సం.. కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌ లు.. మొత్తంగా 13 మంది మృత్యువాత.. నాగర్ కర్నూల్ లో ఏడుగురు, హైదరాబాద్‌ లో నలుగురు, మెదక్ లో ఇద్దరి మృతి

దీంతో మూడు జిల్లాల్లో 13 మంది ప్రాణాలు తీసింది. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Wind Storms Hits Telangana (Credits: X)

Hyderabad, May 27: ఆదివారం సాయంత్రం తెలంగాణవ్యాప్తంగా (Telangana) గాలివాన బీభత్సం (Wind Storms) సృష్టించింది. దీంతో మూడు జిల్లాల్లో (Districts) 13 మంది ప్రాణాలు తీసింది. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. షెడ్డు (Sheds) కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, మరో డ్రైవర్ చనిపోయారు. హైదరాబాద్‌ లో నలుగురు, మెదక్‌ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. ఈదురు గాలులకు పలు జిల్లాలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వ్యాపార కోణంలో తల్లి పాల విక్రయం చట్ట వ్యతిరేకం... ఎవరైనా అమ్మితే చర్యలు తప్పవు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు.. తల్లిపాలను అమ్మేవారికి లైసెన్స్ లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన

హైదరాబాద్ అతలాకుతలం

హైదరాబాద్‌ లో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మొదలైన ఈదురు గాలులు నగరాన్ని అల్లకల్లోలం చేశాయి. గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెట్ల కొమ్ములు, హోర్డింగ్‌ లు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలోని పలు  ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఐపీఎల్ 2024 విజేత కోల్కతా నైట్ రైడర్స్.. 10.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కేకేఆర్...అపజయం మూటగట్టుకున్న సన్ రైజర్స్..



సంబంధిత వార్తలు

Hyderabad: ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. హయత్‌నగర్‌లో అమ్మాయికి బెదిరింపులు,బలవంతంగా అత్యాచారం చేశాడని బాధితురాలి ఆవేదన..వీడియో ఇదిగో

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Hyderabad Fire Accident: హైదరాబాద్‌ లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం (వీడియో)

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు