Vemulawada Temple: వివాదంలో మంత్రి కొండా సురేఖ..భక్తులు విరాళంగా ఇచ్చిన కోడెల విక్రయం, మంత్రి సిఫారసుతోనే జరిగిందని భక్తుల ఫైర్, వీడియో ఇదిగో

మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడేలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. 49 కోడెలను అక్రమంగా విక్రయించారు రాంబాబు. దైవభక్తితో భక్తులు రాజన్నకు సమర్పించిన కోడలను మంత్రి సిఫారసుతో రాంబాబు పొంది విక్రయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

49 cows sold.. controversy on Vemulawada Rajanna Temple(video grab)

Vemulawada, Dec 7:  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న కోడెల విక్రయం కలకలం రేపింది. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడేలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. 49 కోడెలను అక్రమంగా విక్రయించారు రాంబాబు. దైవభక్తితో భక్తులు రాజన్నకు సమర్పించిన కోడలను మంత్రి సిఫారసుతో రాంబాబు పొంది విక్రయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది రాజన్న కోడెల విక్రయం. ఆలయ ఈవో వినోద్ రెడ్డి తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మెప్పుకోసం నిబంధనలు విరుద్ధంగా కోడెలను అప్పగించారని ఆలయ ఈవోపై మండిపడుతున్నారు.  నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ఎందుకంటే??

రైతులకు రెండు నుండి మూడు కోడేలు అప్పగించే అధికారులు మంత్రి లెటర్ ను విచారించకుండానే ఏకంగా 49 కోడలు ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అనుచరుడు రాంబాబు పై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడేలు అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కేటాయింపు పై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.