Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ గణనాథుడికి 70 ఏళ్ళు, ఈ ఏడాది ప్రత్యేకతలివే, ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడు

ఇక ఏ పండగైన, ఏ పూజ చేసిన తొలుత నమస్కరించేంది వినాయకుడికే. అందుకే విఘ్నాలు తొలగించే లంబోదరుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా మూషిక వాహనుడి కృపను పొందేందుకు 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక ఈ ఏడాది కూడా గణనాథుడికి పూజలు చేసేందుకు విగ్రహాలు రెడీ అవుతున్నాయి.

70 years for Khairatabad Ganesh, 70 Feet for 70th anniversary(X)

Hyd, Aug 3: భారతీయ పండగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఏ పండగైన, ఏ పూజ చేసిన తొలుత నమస్కరించేంది వినాయకుడికే. అందుకే విఘ్నాలు తొలగించే లంబోదరుడికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా మూషిక వాహనుడి కృపను పొందేందుకు 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక ఈ ఏడాది కూడా గణనాథుడికి పూజలు చేసేందుకు విగ్రహాలు రెడీ అవుతున్నాయి.

దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రల్లో ఖైరతాబాద్ గణనాథుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ ఏడాదితో ఖైరతాబాద్ గణనాథుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండగా ప్రత్యేక ఏర్పాటుల చేస్తున్నారు. 70 ఏండ్ల ప్రస్థానానికి గుర్తుగా 70 అడుగుల సప్తముఖ మహాగణపతిని కొలువుదీర్చనున్నారు.

ఈ ఏడాది ఏడు పడగల ఆదిశేషుడి నీడలో సప్తముఖాలతో మహాగణపతి దర్శనమివ్వనున్నారు. కుడివైపు చక్రం, పాశం, త్రిశూలం, పద్మం, శంఖం, అభయహస్తం, ఎడమ వైపు రుద్రాక్షమాల, పాశం, గ్రంథం, వీణ, కమలం, గధ, మరో చేతిలో మొదక హస్తం ప్రసాదాన్ని పట్టుకొని ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినాయక జయంతి గురించి తెలుసా? వినాయక చవితికి, జయంతికి మధ్య తేడా ఏమిటి? ఈ ఏడాదిలో వినాయక జయంతి ఎప్పుడు వస్తుంది, పండగ విశిష్టతను ఇక్కడ తెలుసుకోండి!

Here's Tweet:

అలాగే కుడివైపు పది అడుగుల అయోధ్య బాలరాముడి విగ్రహం, ఎడమ వైపు తొమ్మిది అడుగుల ఎత్తులో రాహు, కేతుల విగ్రహాలు, మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.

ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వామి వారికి ఒక వైపు ఉండే రాహు, కేతులు , మరో వైపు బాలరాముడి విగ్రహం రామరాజ్యానికి ప్రతీకగా ఉంటుందని సిద్దాంతి విట్టల శర్మ తెలిపారు. దేశ వ్యాప్తంగా బ్రహ్మచారిణులు, బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోయిందని, ఉప మండపాల్లోని శ్రీ శ్రీనివాసుడు, పార్వతీ పరమేశ్వరుల కల్యాణాలను దర్శించుకుంటే పెండ్లి కాని వారికి వివాహాలు జరుగుతాయని చెబుతున్నారు.