Boy Drowned in Swimming Pool: ఆడుకుంటూ మూడంతస్తుల మీద నుంచి స్విమ్మింగ్‌పూల్‌లో పడ్డ బాలుడు, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి, పుప్పాలగూడలో విషాదం
ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. మూడో అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్ అనే బాలుడు...ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో (drowned) పడిపోయాడు.
Hyderabad, July 06: హైదరాబాద్‌లోని నార్సింగి (Narsingi) పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు. మూడో అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్ అనే బాలుడు...ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో (drowned) పడిపోయాడు. పుప్పాలగూడలోని హాల్‌మార్క్ ట్రాంకిల్ అపార్ట్ మెంట్ లో తన స్నేహితులతో కలిసి మూడవ అంతస్తులో ఆడుకుంటున్న దేవాన్ష్ (5) ప్రమాదవశాత్తు జారి.. అపార్ట్ మెంట్ కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో (drowned in Swimming pool) పడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా.. దేవాన్ష్ ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్థారించారు.
బాలుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ఇలా హఠాత్తుగా మరణించడంతో ఆ తల్లి, బంధువుల రోదనలు మిన్నంటాయి.