Woman Skeleton: ఇసుకలో మహిళ పుర్రె, ఉలిక్కిపడిన అబ్దుల్లాపూర్ మెట్, పుర్రె దొరికిన ప్రాంతంలో కుళ్లిపోయిన అస్తిపంజరం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇసుక లోడ్‌లో గుర్తుతెలియని మహిళ పుర్రెతోపాటు శరీరభాగాలు (Woman Skeleton In Sand)లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. సాహెబ్ నగర్ కి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆన్‌లైన్ లో ఇసుకను కొన్నాడు.

female skeleton was found in a sand dumping yard (Photo-Youtube)

Hyderabad, December 15: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు(Abdullapurmet) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మృతదేహం (DeadBody) కలకలం రేగింది. ఇసుక లోడ్‌లో గుర్తుతెలియని మహిళ పుర్రెతోపాటు శరీరభాగాలు (Woman Skeleton In Sand)లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. సాహెబ్ నగర్ కి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆన్‌లైన్ లో ఇసుకను కొన్నాడు.

డిసెంబర్ 14న ఇసుక స్టాక్ యార్డుకు వెళ్లాడు. అక్కడ లారీలోకి ఇసుకను(Sand) లోడ్ చేస్తున్న సమయంలో ఓ పుర్రె కనిపించింది. దీంతో అతడు కంగుతిన్నాడు. తనకు ఇసుక వద్దని చెప్పి వెళ్లిపోయాడు. దీనిపై అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

శ్రీనివాస్‌రెడ్డిని వెంట తీసుకొని వెళ్లిన పోలీసులు ఇసుక డంప్ వద్దకు క్లూస్ టీమ్‌తో తనిఖీలు చేశారు. పుర్రె దొరికిన ప్రాంతంలో తవ్వి చూశారు. అక్కడ పూర్తిగా కుళ్లిన స్థితిలో అస్థిపంజరం కనిపించింది. పక్కనే గాజులు, చీర, ఓ రుద్రాక్ష మాల కూడా కనిపించాయి. దీంతో ఆ అస్థిపంజరం మహిళదై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మహుబూబ్ నగర్ జిల్లా నుంచి ఏడు నెలలు క్రితం ఇసుక డంప్ చేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ పరిసర వాగుల నుంచి తీసుకొచ్చి డంప్ చేశామని, ఇసుకతో పాటు మృతదేహం కూడా అప్పుడే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన మహిళ వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహానికి సంబంధించిన కీలకమైన ఆధారాలేవీ లేవు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. దిశ అత్యాచారం, హత్య ఘటన తర్వాత నగరంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆడపిల్లలు, మహిళల భద్రత గురించి భయపడుతున్నారు. ఈ క్రమంలో మహిళ అస్థిపంజరం బయటపడటం కలకలానికి దారితీసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif