Amit Shah At Munugode: రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే, కేసీఆర్ ప్రభుత్వం మాయమవుతుంది, మునుగోడు అమిత్ షా ప్రసంగంలో హైలైట్స్ ఇవే..

కానీ ఏమయిందని నేను అడుగుతున్నా..రాబోయే రోజుల్లో బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. సెప్టెంబర్ 17లో తెలంగాణ విమోచన దినం జరుపుతామని అమిత్ షా అన్నారు.

Union Home Minister and BJP President Amit Shah | File Photo

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నల్గొండలో ఏర్పాటుచేశారా? తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టారా? తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ హామీ నిలబెట్టుకున్నారా? మీకు ఇళ్ళు వచ్చాయా? దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యారు.. తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.. మరోసారి ఎన్నికల్లో గెలిస్తే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయరు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు ఇస్తానన్నారు.

దళితులకు 10లక్షలు అందాయా? ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. మీకు ఎవరికైనా అందిందా? గిరిజనులకు భూమి ఇస్తానని ఇచ్చారా? ఉపాధి ఇస్తానని అన్నారు.. యువకులకు ఉపాధి లేదు. కేసీఆర్ కుటుంబాలకు మాత్రమే ఉపాధి లభిస్తోంది.

భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగం ప్రారంభించారు అమిత్ షా.. బండి సంజయ్ ప్రసంగం లేకుండానే అమిత్ షా స్పీచ్ ప్రారంభం అయింది. ఇంతమంది ప్రజలు రావడం సంతోషంగా వుంది.. మీకు ప్రణామాలు చెబుతున్నాను. రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు... కేసీఆర్ సర్కార్ పతనానికి ఇది నాంది.

రాబోయే రోజుల్లో కేసీఆర్ సర్కార్ ని కూకటివేళ్లతో పెకలించే ప్రయత్నం ఇది..రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. ఒక పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమవుతుంది. సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినం జరపాలి.

కేసీఆర్ వాగ్దానం చేశారో గుర్తుందా? తెలంగాణ విమోచన దినం ఉత్సవంగా జరుపుతానని చెప్పారు. కానీ ఏమయిందని నేను అడుగుతున్నా..రాబోయే రోజుల్లో బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. సెప్టెంబర్ 17లో తెలంగాణ విమోచన దినం జరుపుతాం. మజ్లిస్ కి భయపడి ఉత్సవం జరపడం లేదు. మేం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తాం..అని అమిత్ షా ప్రకటించారు. అంతకు ముందు మునుగోడు బహిరంగ సబకు చేరుకుని అందరికీ అభివాదం చేసిన హోంమంత్రి అమిత్ షా బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ నేతలు, అమిత్ షాని సత్కరించారు. నేతలతో సభా స్థలి నిండిపోయింది.