Telangana Shocker: చిన్నవయసులోనే గుండెపోటుతో కుప్పకూలి ఇంజనీరింగ్ విద్యార్ధిని మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన
ఇంకా విషాదకరం ఏంటంటే..అత్యంత చిన్న వయసులో గుండెపోటు రావడం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లా పట్టణంలో చోటు చేసుకుంది.
కాలేజీలో హఠాత్తుగా గుండెపోటుతో ఓ విద్యార్థిని మృతి చెందిన తీవ్ర కలకలం రేపింది. ఇంకా విషాదకరం ఏంటంటే..అత్యంత చిన్న వయసులో గుండెపోటు రావడం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లా పట్టణంలో చోటు చేసుకుంది.
వార్త వివరాల్లోకెళితే.. నగరానికి చెందిన ప్రదీప్తి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం సాయంత్రం కాలేజీలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. దీప్తి చికిత్సపొందుతూ గురువారం ఉదయం మరణించింది.
ప్రదీప్తి మరణ వార్త విన్న ఆమె తల్లిదండ్రులు రేణుక-భూమేశ్ లు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రదీప్తి మృతదేహాన్ని అంబులెన్స్ లో సిరిసిల్ల లోని తన ఇంటికి తరలించారు. ఆమె మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్న వయస్సులోనే ఇంజనీరింగ్ విద్యార్థి గుండెపోటుతో మరణించడం సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపింది.