AP, Telangana Weather Alert: హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో

ఇక వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉదయం నుండి నగర వ్యాప్తంగా భరీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

AP, Telangana Weather Alert Heavy Rains To Hyderabad, IMD issues yellow alert

Hyd, Aug 31: భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇక వాతావరణ శాఖ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఉదయం నుండి నగర వ్యాప్తంగా భరీ వర్షం కురుస్తోంది. రాత్రి వరకు భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తర ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయుగుండం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాత్రి కళింగపట్నం దగ్గర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో ఏపీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ఇక తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి నుండే పలు చోట్ల భారీ వర్షౄలు కురుస్తున్నాయి. ఇక ఇవాళ ఉదయం కొన్ని చోట్ల ముసురు అలుముకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి కురిసిన వర్షం ఇవాళ ఉదయానికీ వదలకపోవడంతో భాగ్యనగర వాసుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి.

ప్రధానంగా ఆఫీసులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూకట్‌పల్లి, లింగంపల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, నాంపల్లి, కొండాపూర్, మాదాపూర్, చందానగర్, దిల్ సుఖ్ నగర్, ఫిల్మ్‌నగర్, హయత్ నగర్, లక్డీకపూల్, కోఠి, ఖైరతాబాద్, మెహిదీపట్నం, హైటెక్ సిటీ, వనస్థలిపురం సహా చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. హైదరాబాద్‌ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ

Here's Video:

సెప్టెంబరు 2, 3 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం పడగా ఇవాళ జయశకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,24,525 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 3,49,152 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.

Here's Video:

Full non-stop rain from nite onwards #katrapally village #mahabubabad district pic.twitter.com/iq0Jheb0T9