Bandi Sanjay: ఫిబ్ర‌వ‌రి 2వ తారీఖు కూడా అయిపోయింది! కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బండి సంజ‌య్ హెచ్చ‌రిక‌, గ్రూప్ -1 నోటిఫికేష‌న్ ఏమైందంటూ నిల‌దీత‌

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.

BJP State President Bandi Sanjay Kumar (Photo Credit: ANI)

Hyderabad, FEB 02: తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. ఫిబ్రవరి 1 వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్కడ? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. గ్రూప్-1 నియామకాలను (Group -1) ఉంటాయని హామీ ఇచ్చారని అన్నారు. అందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకుని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారని బండి సంజయ్ అన్నారు.

 

ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదని అన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన గ్రూప్ -1తో పాటు గ్రూప్-2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం