Bandla Ganesh Joining In Congress: మళ్లీ కాంగ్రెస్‌లోకి స్టార్ ప్రొడ్యూసర్ ఎంట్రీ, ఈ సారి ఎమ్మెల్యేగా టికెట్ సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బండ్ల గణేష్‌, సూర్యాపేటలో భట్టి విక్రమార్క సభలో పాల్గొంటానంటూ ట్వీట్

ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో, తన ఇంటర్వ్యూలతో, రాజకీయ ఇంటర్వ్యూలతో బాగా వైరల్ అయ్యారు. బండ్ల్ గణేష్ (Bandla Ganesh) కూడా ట్విట్టర్ లో రోజూ యాక్టివ్ గా ఉంటారు.

Bandla Ganesh (Credits: Twitter)

Hyderabad, June 25: బండ్ల గణేష్.. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా ఈవెంట్స్ లో తన స్పీచ్ లతో, తన ఇంటర్వ్యూలతో, రాజకీయ ఇంటర్వ్యూలతో బాగా వైరల్ అయ్యారు. బండ్ల్ గణేష్ (Bandla Ganesh) కూడా ట్విట్టర్ లో రోజూ యాక్టివ్ గా ఉంటారు. పలుఅంశాలపై, సినిమాలపై పోస్టులు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు నటుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్స్ కొట్టిన బండ్లన్న ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ (Congress) లో చేరి కొన్ని రోజులు హడావిడి చేశారు. కాంగ్రెస్ తరపున MLA గా పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు బండ్ల గణేష్ (Bandla Ganesh). గతంలోనే ఇక రాజకీయాల్లోకి రాను అని ప్రకటించాడు. మళ్ళీ కొన్నాళ్ళకు ఇటీవలే త్వరలో నా రాజకీయ జీవితంపై క్లారిటీ ఇస్తాను అని తెలిపాడు. అయితే ఈసారి బండ్లన్న కాంగ్రెస్ లోకి రాడేమో, తనకి ఇష్టమైన పవన్ కళ్యాణ్ జనసేనలోకి వెళ్తాడేమో అని పలువురు అనుకున్నారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ తో మరోసారి కాంగ్రెస్ లోకే వస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవలే బండ్ల గణేష్ మల్లికార్జున ఖర్గే, డీకె శివకుమార్, రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తుంది. CLP నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న (Bhatti Vikramarka People March) సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నేడు సూర్యాపేటకు చేరుకుంది. అయితే దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ తాను కూడా పాదయాత్రలో చేరబోతున్నట్టు ప్రకటించాడు. బండ్ల గణేష్ తన ట్వీట్ లో.. అన్నా వస్తున్నా.. అడుగులో అడిగేస్తా, చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు (Suryapet) వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అని రాశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. బండ్ల గణేష్ మరోసారి కాంగ్రెస్ లోకే వస్తున్నట్టు దీంతో క్లారిటీ ఇచ్చేశాడని భావిస్తుండగా మరి ఈ సారైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడేమో చూడాలి.