Discount on Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలానాలు ఇంకా క్లియర్ చేసుకోలేదా, అయితే ఈ రోజు వరకే డిస్కౌంట్, వాహనదారులు వెంటనే అలర్ట్‌ అవ్వండి

కొంత మంది వాహనాదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాహనాలకు కూడా జరిమానాలు ఉన్నా ఇంకా చెల్లించనట్లు సమాచారం.

Hyderabad Traffic Police (photo-ANI)

Hyd, Jan 10: తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలానాల చెల్లింపునకు (Discount on Traffic Challans) గడువు నేటితో ముగియనుంది. కొంత మంది వాహనాదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాహనాలకు కూడా జరిమానాలు ఉన్నా ఇంకా చెల్లించనట్లు సమాచారం.

పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబరు 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80%, ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించటంతో మంచి స్పందన లభిస్తోంది.

2018 నుంచి 2024 జనవరి 8 నాటికి జిల్లాలో 5 లక్షల పెండింగ్‌ చలాన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 30 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. సోమవారం నాటికి 2.25 లక్షల కేసులకు రూ. 2.50 కోట్లు చెల్లించారు. ఇంకా జిల్లాలో 2.75 లక్షల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.నేటితో గడువు (pay traffic challans on concession Deadline)ముగియనున్న నేపథ్యంలో వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

పెండింగ్ చ‌లాన్ల వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డులు, ఒక్కరోజే కోట్ల‌లో చ‌లాన్లు క‌ట్టిన వాహ‌న‌దారులు, జ‌న‌వ‌రి 10తో ముగియ‌నున్న ఆఫ‌ర్

సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని, చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహం ఎదురైనా 040-27852721, 8712661690(వాట్సప్‌) నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మీసేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానూ చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు వివరించారు. https://echallan.tspolice.gov.in/publicview/ వెబ్‌సైట్‌ ద్వారా ట్రాఫిక్‌ చలానాలు చెల్లించవచ్చు.

భారీగా పెండింగ్ చలానాలు ఉన్నాయా.. ఏం పర్లేదు, ఈ నెలాఖరు వరకు 75 శాతం డిస్కౌంట్‌తో కట్టేయండి, వాహనదారులకు బంపరాఫర్ ప్రకటించిన తెలంగాణ ట్రాఫిక్‌ పోలీస్ శాఖ

ఇదిలా ఉంటే ప్రజాపాలన కార్యక్రమం కారణంగా ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవడానికి మీ సేవ, ఆధార్‌ సెంటర్లు ప్రజలతో సందడిగా మారడంతో ట్రాఫిక్‌ చలాన్లు చెల్లించలేకపోతున్నామని వాహనాదారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌, పేటీఎం ద్వారా చలాన్లు చె ల్లించడానికి అవగాహన లేకపోవడంతో చెల్లించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గడువు పెంచితే చెల్లిస్తామని చెబుతున్నారు.