Telangana Governor Quota MLC: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

Big Shock to BRS, Supreme Court stay on High Court Orders On Governor Quota MLC Appoinments

Delhi,Aug 14:  సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

గవర్నర్ నామినేట్ చేయడాన్ని తాము అడ్డుకోలేమని , కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే అది గవర్నర్‌, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడమన్నది ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలింది.

జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరలే ధర్మాసనం విచారణ చేపట్టగా ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం, గవర్నర్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నా, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. పడకేసిన పల్లెలు, కంపు కొడుతున్న పట్టణాలు?, ఇదేనా ప్రజా పాలన అంటే మండిపడ్డ కేటీఆర్

తమ నియామకాన్ని పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్‌ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ సుప్రీంను ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా అప్పటి గవర్నర్ తమిళి సై అమోదం తెలిపారు. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ. దీంతో ఎమ్మెల్సీ నియామక గెజిట్ కొట్టివేస్తూ.. కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై స్టే విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.