Motkupalli Narasimhulu Health Update: మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపిన వైద్యులు, కరోనాతో సోమాజిగూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత
అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి (Motkupalli Narasimhulu Health Update) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి (Motkupalli Narasimhulu) ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.
Hyderabad, April 18: తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి (Motkupalli Narasimhulu Health Update) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి (Motkupalli Narasimhulu) ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.
టీడీపీలో సీనియర్ నాయకుడిగా, మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నర్సింహులు.. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి దూరంగా ఉన్నారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీకి దూరమైన తర్వాత ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని అనుకున్నారు. కానీ, కేసీఆర్ నుంచి ఎటువంటి పిలుపు లేకపోవడంతో.. నవంబర్ 4,2019న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు.
ఇక ములుగు ఏజెన్సీలో మంగపేట మండలంలోని రామచంద్రుని పేటలో కరోనా విజృంభిస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ రామచంద్రునిపేట గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వారంరోజులుగా సగటున రోజుకు 40 కేసులు నమోదవుతున్నాయి. 18 ఆస్పత్రుల్లో 1,890 మందికి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయగా ములుగు మండలంలో 30 మందికి, ఏటూరునాగారంలో నలుగురికి, వెంకటాపురం (నూగూరు)లో నలుగురికి, వెంకటాపూర్(రామప్ప)లో 10 మందికి, గోవిందరావుపేటలో ఇద్దరికి, మంగపేట మండలంలో నలుగురికి వైరస్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య తెలిపారు.
మరో 28 మంది నుంచి ఆర్‌టీపీసీఆర్ పద్ధతిలో నమూనాలు సేకరించి కేఎంసీ వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు. ఓ పక్క కరోనా వ్యాప్తి తీవ్రం గా ఉన్న తరుణంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. అత్యధికంగా ఈ ఒక్కరోజే 2,803 మందికి టీకా వేశారు. సబ్‌సెంటర్ల పరిధిలోని గ్రామాలను ఎంపిక చేసి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా వేస్తున్నారు. ఇన్ని రోజులు వ్యాక్సిన్‌పై సందేహాలతో దూరంగా ఉన్న ప్రజలు కరోనా భయంతో టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.