MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

సంగారెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడిన రఘునందన్‌ రావు..కాంగ్రెస్ ప్రభుత్వం లో రేవంత్ రెడ్డి కూడా రైతులను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు అన్నారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు అన్నారు.

BJP MP Raghunandan Rao Slams CM Revanth Reddy on Praja Palana(Video Grab)

Hyd, Nov 14: పదేళ్ల పైశాచిక పాలనలో BRS రైతులను మల్లన్నసగర్ గురించి అర్ధరాత్రి అరెస్టు చేశారు అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడిన రఘునందన్‌ రావు..కాంగ్రెస్ ప్రభుత్వం లో రేవంత్ రెడ్డి కూడా రైతులను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు అన్నారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు అన్నారు.

నిజంగా ఫార్మా సిటి నిర్మించాలంటే గత ప్రభుత్వం సేకరించిన భూములలో ఏర్పాటు చేయవచ్చు కానీ వాటిని ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వలేదు...పాత ముఖ్యమంత్రి చేసిన తప్పులనే రేవంత్ చేస్తున్నారు అన్నారు. గత ప్రభుత్వంలో గజ్వేల్ కు గడ సంస్థ పెట్టుకుంటే రేవంత్ కూడా కడ సంస్థ పెట్టుకున్నారు...

ఖమ్మం మిర్చి యార్డు లో నాడు రైతులను అరెస్టు చేసి బేడీలు వేసినప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితుల దగ్గర ధర్నా చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు అన్నారు.

తప్పు చేసినోళ్లు ఎవరైనా సరే చట్టం ముందు సమానమే...ఎన్నో ఫార్మా కంపెనీలు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి గతంలో సేకరణ చేసినటువంటి భూములను తమకు అందిస్తే అన్ని కంపెనీలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని చెప్పినా ఈ ప్రభుత్వం వినిపించుకోవడం లేదు అన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసింది.. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా ఒకరు ఢిల్లీలో ఒకరు బొంబాయిలో కూర్చొని మాట్లాడుతున్నారు అన్నారు.  కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు.. అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

అసలు వీళ్ళిద్దరూ చర్లపల్లి లో ఉండాల్సినటువంటి వాళ్ళు..ఇందులో ఒకరు ముందుగానే చర్లపల్లి వెళ్లిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇద్దరు కలిసి చర్లపల్లి జైలులో కూర్చోవాలి అన్నారు. మళ్లీ మేమే రాబోతున్నాం మేమే చేస్తున్నాం అని చెప్పుకున్న ఇరు పార్టీలు తమ గొప్పలను ప్రదర్శించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేరులోనే కాకుండా పాలనలో ప్రజా పాలన కనబర్చాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు.



సంబంధిత వార్తలు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి