Amit Shah Slams Congress: తెలంగాణ గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపు

బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై (Amit Shah Slams Congress) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అవినీతి, కుంభకోణాల పార్టీ అని కేంద్రమంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Amit Shah And Revanth Reddy (Photo-ANI/FB)

Hyd, Mar 12: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై (Amit Shah Slams Congress) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అవినీతి, కుంభకోణాల పార్టీ అని కేంద్రమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశంలో రూ. 12 లక్షల కోట్ల అవినీతికి (Congress party of corruption of 12 lakh crores) పాల్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేం చెప్పేది అవాస్తవమని చెప్పాలని సవాలు విసిరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి మజ్లిస్‌ పార్టీకి ఆప్తమిత్రుడు అని అమిత్‌ షా (Union Minister Amit Shah ) అన్నారు. అందుకే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌ను చేశారని ఆరోపించారు. సీఏఏను అమలు చేసి పాక్‌, బంగ్లాదేశ్‌ శరణార్థులకు న్యాయం చేశామని తెలిపారు. సీఏఏను కాంగ్రెస్‌,మజ్లిస్‌ వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. సీఏఏఈ అమలుతో ముస్లింల పౌరసత్వం రద్దవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని, బీజేపీ 400 సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదల, అస్సాం, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులు ప్రకటన

ఇళ్లు ఇళ్లు తిరిగి ప్రచారం చేసే కార్యకర్తకు ఎంత హక్కు ఉందో సోషల్ మీడియాకు అంతే. మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రాబోతుంది.దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ పేరు తప్ప వేరే పేరు వినిపించడం లేదు. తెలంగాణలో 12 కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలవాలి. 10ఏళ్లలో మోదీ సర్కార్ అవినీతిని అంతం చేసింది. దేశం సురక్షితంగా ఉంది అంటే కారణం మోదీ సర్కార్. మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. 5 వందల ఏళ్ల కల నెలవెర్చిన ఘనత మోదీ సర్కార్‌ది. గతంలో కాంగ్రెస్ సర్కార్ చేయని పని మోదీ చేసి చూపించాడు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత మోదీ... కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయం మాత్రమే చేసింది. మోదీ సర్కార్ చేసి చూపించిందని అన్నారు.

హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ, సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా, ఇంతకీ ఎవరీ సైనీ ?

ట్రిపుల్ తలాక్ తీసివేసిన వ్యక్తి మోదీ. మహిళ రిజర్వేషన్ కల్పించారు. సీఏఏ నిర్ణయం కూడా మోదీ సర్కార్ చేసింది. కాంగ్రెస్ పార్టీ చేయని పనిని మోదీ సర్కార్ చేసి చూపించింది. సీఏఏని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. మీ చేతిలో మెక్ ఇన్ ఇండియా ఫోన్ ఉంది.దీని ఘనత మోదీది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, మజ్లిస్ పార్టీలు వేరు ఎజెండా ఒక్కటే, మజ్లిస్ ఎజెండా లో మిగితా పార్టీలు నడుస్తాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మొత్తం కుటుంబ పార్టీలే... అవినీతి పార్టీలే ఈ మూడు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు.

మోదీ జీవితం మొత్తం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాడు. మోదీ విరామం లేకుండా పని చేస్తున్నాడు..రాహుల్ బాబా విశ్రాంతి కోసం విదేశాలకు వెళతాడు. సీఎం రేవంత్రెడ్డిని అడుగుతున్న గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క తెలంగాణకు మోదీ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల భరతం పట్టాడు మోదీ. ఇండియా అలయన్స్, బీఆర్‌ఎస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరు. 400 స్థానాల్లో 12 కంటే ఎక్కువ స్థానాలు తెలంగాణ నుండి ఉండాలి’ అని అమిత్ షా అన్నారు.

మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల చొప్పున వేస్తూ.. అండగా ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా.. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తాం. ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చాం. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ.1.17లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. మోదీ పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు వచ్చాయి. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు’’ అని అమిత్ షా వివరించారు.



సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు