Black Magic in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. హడలెత్తించే దృశ్యాలు (వీడియో)
శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మేకులు దించిన బొమ్మలు, దారాలు చుట్టిన కుండలు, సమాధుల్లో గోతులు వంటి దృశ్యాలు స్థానికులను భయకంపితులను చేస్తున్నాయి.
Hyderabad, Nov 11: హైదరాబాద్ పాతబస్తీ (Hyderabad Old city)లో క్షుద్రపూజలు (Black magic) కలకలం రేపుతున్నాయి. శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మేకులు దించిన బొమ్మలు, దారాలు చుట్టిన కుండలు, సమాధుల్లో గోతులు వంటి దృశ్యాలు స్థానికులను భయకంపితులను చేస్తున్నాయి. గుడ్లు, ఇతర వస్తువులపై క్షుద్రమంత్రాలు రాసిఉండటం అటుగా వెళ్తున్నవారి గుండెల్లో గుబులురేపుతోంది. తాజాగా దైరా మీర్ మోమిన్ స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్టు తెలుస్తుంది. స్థానికుల ఫిర్యాదుమేరకు పోలీసులతో సహా ఘటనా స్థలికి చేరుకుని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ విషయంపై ఆరా తీశారు. ఇకపై ఇలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మతాధికారులు, శ్మశానాల (cemetery) ఇంఛార్జీలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Here's Video
తహసీల్దార్ పై క్షుద్ర పూజలు
పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శ్మశాన వాటికలో సమాధిపై రెండేండ్ల కిందట ఓ మహిళా తహసీల్దార్ పై చేతబడికి యత్నించారన్న విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బండ్లగూడలో నాలుగేళ్ళు తహసీల్దార్ పనిచేసిన షేక్ ఫర్హాన్ ఫొటోకి క్షుద్రపూజలు చేసిన స్థలంలో మరో ఎమ్మార్వో ఫోటో లభ్యం కావడం పాతబస్తీలో తీవ్ర కలకలం రేపింది.