Telangana Panchayat Elections: బ్రేకింగ్, ఆగస్టులోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికలు?,ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు యదాతథం,త్వరలో నోటిఫికేషన్?

పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జూన్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగిన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు.

telangana panchayat polls on august?

Hyd, July 26: తెలంగాణలో మళ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పాలనపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి జూన్‌లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ప్రచారం జరిగిన ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలనే యధాతథంగా ఉంచి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోండగా దీనికి సంబంధించి త్వరలోనే అఫిషియల్ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగస్టులోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఆగస్టు 15తో రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవుతుంది కాబట్టి ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు రేవంత్. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయితే నాలుగేళ్లపాటు రాష్ట్రంలో ఏ ఎన్నికలూ ఉండవని భావిస్తున్నారు. అందుకే వీలైనం త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్. అందుకే వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.

వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చట్టాన్ని చేశారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తించేలా చట్టం చేయగా ఈసారి కూడా ఇవే రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామా పంచాయతీలున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి.  సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ డెడ్ లైన్‌, రాజకీయాల కోసం రైతులను ఆగం చేయవద్దు, 50 వేల మంది రైతులతో పంపులు ఆన్‌ చేస్తామని హెచ్చరిక