Hyd, July 26: బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్....సీఎం రేవంత్ రెడ్డికి డెడ్‌లైన్ విధించారు. ఆగస్టు 2 వరకు కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్ చేయకుంటే 50 వేల మంది రైతులతో పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న... రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారాయన్నారు.
రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని, కేవలం కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు పంపులు ఆన్ చేయడం లేదని విమర్శించారు. ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని గుర్తించిన కాంగ్రెస్ నేతలు మాత్రం కళ్లుండి చూడలేని కబోదుల్లాగా ప్రవర్తిస్తున్నారన్నారు. చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్టుపై విష ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ నేతలు రైతులపై రాజకీయాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో కరువు అనే మాట వినపడొద్దని కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మించామని చెప్పారు కేటీఆర్. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి కటకట రాలేదని కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కొద్దిరోజుల్లోనే రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్‌కు కూడా మంచినీళ్లు అందించొచ్చు అని సూచించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తుండటం దారుణం అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిర 17 పంపులు రెడీగా ఉన్నాయని, రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు కానీ రేవంత్ ప్రభుత్వం అలా చేయడం లేదన్నారు. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని ప్రజలంతా కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. పంప్‌హౌస్‌లపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే రైతులతో కలిసి తామే పంపులను ఆన్ చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అసెంబ్లీలో నిలదీస్తం అని స్పష్టం చేశారు కేటీఆర్. రుణమాఫీ, రైతులను వేధిస్తున్న బ్యాంకర్లు, ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు