KCR with Farmers (photo-Video Grab)

Karimnagar, April 5: లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులతో మమేకమవుతున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలోని మొగ్దుంపూర్‌లో ఎండిపోయిన పంటను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతన్నలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు గులాబీ దళపతి ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని.. వరి కోత కోసేందుకు ఇబ్బందయ్యేదని పేర్కొన్నారు.  తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్! రెండు రోజుల పాటూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న ఐఎండీ, ఏయే జిల్లాల్లో వ‌ర్షాలున్నాయంటే?

ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది.. ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారు. మంచినీళ్లకు కూడా గోసవుతుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోయిన సంవత్సరం మండుటెండల్లో కూడా చెక్‌డ్యామ్‌లు మత్తడి పోశాయని.. ఈ సంవత్సరం చుక్కా లేకుండా అడుగంటిపోయాయని మరో రైతు తెలిపారు. స్పందించిన కేసీఆర్‌ రైతులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని తెలిపారు



సంబంధిత వార్తలు

BRS Won MLC By Election: సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ‌, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్ ఘ‌న విజ‌యం

Revanth Reddy Slams KCR: కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, కేటీఆర్ మ‌తిలేని వ్యాఖ్య‌లు, ద‌శాబ్ది ఉత్స‌వాల‌కు కేసీఆర్ రాక‌పోవ‌డంపై రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు

2024 భారతదేశం ఎన్నికలు: ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

Telangana Formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు, మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపు

Telangana Phone Tapping Case: హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్, సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌, ఊహించని ట్విస్టులతో సాగుతున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు

Graduate MLC By Election: తెలంగాణ‌లో ఉప ఎన్నికకు ముగిసిన ప్ర‌చారం, సోమ‌వారం రోజు పోలింగ్, మూడు ఉమ్మ‌డి జిల్లాల్లో క‌లిపి ఎంత‌మంది ఓట‌ర్లున్నారంటే?

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ