IPL Auction 2025 Live

Harishrao: సీఎం రేవంత్ రెడ్డి గజదొంగ, దమ్ముంటే హైడ్రా ఆఫీస్ కూల్చండి హరీశ్ సవాల్, రుణమాఫీపై తప్పుదారి పట్టించేందుకేనని కామెంట్

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు కష్టపడి నిర్మించిన హైదరాబాద్ బ్రాండ్ ని కూల్చేశారు అని దుయ్యబట్టారు హరీశ్. బుద్ధా భవనములోనే హైడ్రా ఆఫీస్ ఉంది, దమ్ముంటే దానిని కూల్చండని సవాల్ విసిరారు. జీహెచ్ ఎంసి బిల్డింగ్ కూడా నాలాపైనే ఉందని దానిని కూలగొట్టాలన్నారు. జలవిహార్, నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ లో ఉన్న బోట్స్ క్లబ్ అన్నింటిని కూలగొట్టాలన్నారు హరీశ్.

brs-harishrao-challenges-cm-revanth-reddy-on-hydra-demolition

Hyd,Aug 29:  రుణమాఫీపై ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు కష్టపడి నిర్మించిన హైదరాబాద్ బ్రాండ్ ని కూల్చేశారు అని దుయ్యబట్టారు హరీశ్. బుద్ధా భవనములోనే హైడ్రా ఆఫీస్ ఉంది, దమ్ముంటే దానిని కూల్చండని సవాల్ విసిరారు. జీహెచ్ ఎంసి బిల్డింగ్ కూడా నాలాపైనే ఉందని దానిని కూలగొట్టాలన్నారు. జలవిహార్, నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ లో ఉన్న బోట్స్ క్లబ్ అన్నింటిని కూలగొట్టాలన్నారు హరీశ్.

మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన హరీశ్..రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిదన్నారు. రుణమాఫీ చేస్తా అని ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని చెప్పి మాటతప్పారని దుయ్యబట్టారు.  హైడ్రా పేరుతో బెదిరింపులు, సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్, హైడ్రా పేరుతో అవినీతి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక

రుణమాఫీ కాలేదు అని రెవిన్యూ, వ్యవసాయా మంత్రులు చెప్పారు...నా ఛాలెంజ్ 100 శాతం చేయాలి అనేది కదా అని తెలిపారు హరీశ్‌. రుణమాఫీ ఛాలెంజ్ విషయంలో ఎవరు గెలిచారు అన్నది గల్లీలో ఉన్న లీడర్స్ ని అడిగినా చెబుతారన్నారు. రాహుల్ గాంధీ వస్తే రుణమాఫీ అయిందా లేదా అని ఏ గ్రామానికైనా వెళదాం, లేకపోతే మా నియోజవర్గములోని ఏ గ్రామంకైనా వెళదాం రైతులు అడుగుదాం అన్నారు. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి తీసుకొని వెళ్ళతాను...రాహుల్‌ని కూడా రేవంత్ మోసం చేశారన్నారు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి