హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి,బెదిరించి అవినీతికి పాల్పడితే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు రేవంత్.

గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేళ్ళ కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అటువంటి వారిపై కఠిన చ‌ర్య‌లు ఉంటాయని హెచ్చరించారు.

ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.  సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయ‌న సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాల‌నీలో నోటీసులు అందుకున్న‌వారిలో ప‌లువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)