యూపీలోని మీర్జాపూర్ లో ఓ పోలీస్ అధికారి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించాడు. ‘నా మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. నేను మీతో రాను’ అంటూ వారిని ప్రాథేయపడ్డాడు.

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.చిల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శివశంకర్ సింగ్ కేసు రాజీ కోసం ఒ వ్యక్తి నుంచి రూ.30,000 లంచం తీసుకున్నాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు బలవంతంగా ఆ పోలీస్‌ అధికారిని తమ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. ముంబైలో టీసీఎస్ రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న మానవ్, షాకింగ్ వీడియో ఇదిగో

Cop Caught Red-Handed While Taking Bribe Of Rs 30,000

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)