Hyderabad, AUG 29: హైడ్రా (Hydra)దూకుడు కొనసాగుతోంది. చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తోంది. ఎవర్నీ వదలకుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు. చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో గుబులు రేగుతోంది. ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని (Durgam Cheruvu) కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు.
నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి (Tirupti Reddy), పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిశాయి.