Hyd, Aug 28: హైడ్రా వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, పార్కులు, నాలల కబ్జాల పైన చర్యలే మా మొదటి ప్రాధాన్యం అని తేల్చిచెప్పారు.
చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదిలి పెట్టం అని స్పష్టం చేశారు. జంట జలాశయాలను పరిరక్షించడమే మా భాద్యత అని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లో నా కుటుంబ సభ్యులు, బంధువుల భవనాలు ఉంటే వివరాలు ఇవ్వండి నేనే దగ్గరుండి కూల్చివేపిస్తా అని సవాల్ విసిరారు.
కేటీఆర్ ఫామ్ హౌజ్ లీజ్ తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా ? అని ప్రశ్నించారు. చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు బఫర్ జోన్ లో ఫామ్ హౌజ్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా లీజుకు తీసుకుంటాడు? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కాలేజీల నిర్మాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారుల నోటీసులు
ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదటగా మా పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్ హౌజ్ నుండే ప్రారంభమైందన్నారు. చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని అందరికి సూచించారు. వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదు అన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో హైడ్రా తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రజా ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు రేవంత్.