Khairatabad MLA Danam Nagender (Photo-X)

Hyderabad, Jan 23: హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) మరోసారి హైడ్రా మీద సీరియస్ అయ్యారు. ఫుట్‌పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలంటూ వ్యాఖ్యలు (Danam Nagender on HYDRAA Demolitions) చేశారు. హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే (Khairatabad MLA Danam Nagender) మాట్లాడుతూ.. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. పేద ప్రజల జీవన ఆధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారు.. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారు అని ఆరోపించారు. అధికారులు చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నా.. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదు.. ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి అని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెడ్ అలర్ట్... జనవరి 30వ తేదీ వరకు సందర్శకులు రావొద్దని ఆదేశాలు, ఎయిర్‌పోర్టులో నిఘా పెంచిన అధికారులు

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని.. హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనని తెలిపారు. తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్‌ కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని... హైదరాబాద్‌లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం ముందుంటాడని స్పష్టం చేశారు.గతంలో తాను హైడ్రా విషయంలో మాట్లాడినా.. ఇప్పుడు ఫుట్‌పాత్‌ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు.

Khairatabad MLA Danam Nagender Slams HYDRAA Demolitions

అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు.. ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి.. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది.. దానిని స్వాగతిస్తున్నాను.. మూసి ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష.. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరికరణ చేసి, పర్యాటక కేంద్రంగా మారుస్తుంది అని దానం నాగేందర్ చెప్పారు.

ఇటీవల మాదాపూర్‌లో ఫుట్‌పాత్‌లపై కుమారి ఆంటీని వేధిస్తున్నప్పుడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారో.. ఇప్పుడు ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ‘నాకు నిద్ర ఉండడం లేదు... అక్కడ కూల్చివేస్తున్నారు... ఇక్కడ కూల్చివేస్తున్నారు అని పేదలు ప్రతి రోజు నా దగ్గర కు వస్తున్నారు. పేద ప్రజల శాపనార్ధాలు ప్రభుత్వానికి మంచిది కావు. బస్తీలో పేద ప్రజల ఇళ్ళు, షాప్‌లు కూల్చివేస్తే ప్రభుత్వానికి మంచిది కాదన్నారు.

ఇక చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్‌చల్‌ చేశారు. ఎక్కడినుంచో బతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా? అంటూ చిందులు తొక్కారు. బుధవారం షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణాల్ని అధికారులు కూల్చివేతలు చేపట్టగా, ఈ కూల్చివేతలపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైరయ్యారు. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని దానం హుకుం జారీ చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ దానం హెచ్చరిక జారీ చేశారు.