KTR Lawyer Sundaram: రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు, ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ లబ్ది పొందలేదు..ఈ కేసుతో ఏసీబీకి సంబంధం లేదన్న లాయర్ సుందరం

రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు అన్నారు కేటీఆర్ లాయర్ సుందరం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన న్యాయవాది సుందరం...అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు? చెప్పాలన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దం అన్నారు.

KTR lawyer Sundaram key comments on Formula-E race(X)

Hyd, December 20: రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు అన్నారు కేటీఆర్ లాయర్ సుందరం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన న్యాయవాది సుందరం...అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు? చెప్పాలన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దం అన్నారు.

అఫెన్స్ జరిగిందని తెలిశాక మూడు నెలలలోపే కేసు రిజిస్టర్ చేయాలి...11 నెలల తర్వాత కేసు నమోదు చేశారు అన్నారు. 2023, అక్టోబర్ నెలలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే FEOకి చెల్లించారు...అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుంది? అన్నారు. ఫార్ములా ఈ- కార్ రేసింగ్‌లో నేర పూరిత దుష్ప్రవర్తన ఎక్కడా జరగలేదు,13(1)A, 409 సెక్షన్లు వర్తించవు అన్నారు.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఈసీ పరిశీలించాలి.. కానీ ఏసీబీకి సంబంధం లేదు అన్నారు. రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే, కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు? అన్నారు. ఫార్ములా-ఈ రేస్ నిర్వహించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు ఉందని...ఒక వేళ రేస్ నిర్వహించడం ఇష్టం లేకపోతే అది ప్రభుత్వ ఇష్టం కానీ ఇందులో అవినీతి ఎక్కడ ఉందన్నారు.సీజన్ 9 రేస్ వల్ల రూ.700 కోట్లు లాభం వచ్చింది... 18 సాయంత్రం 5 గంటలకు ఫిర్యాదు వస్తె 19 న కేస్ నమోదు చేశారు అన్నారు. అసెంబ్లీలో దాడి ఎవరు చేశారో మీరే చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై రచ్చ

సీజన్ 10 కి అగ్రిమెంట్ అవసరం లేదు...అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారు...ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏసీబీకి ఏం సంబంధం అన్నారు. కోడు ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుంది...రేసు కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్ పై కేసు ఎందుకు పెట్టారు చెప్పాలన్నారు సుందరం. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

RG Kar Case Verdict: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం, నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్దారించిన సీబీఐ న్యాయస్థానం, మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు

Maruti Suzuki E Vitara: మారుతి సుజుకీ నుంచి కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ లాంచ్‌, ఆటో ఎక్స్‌పోలో ఫీచర్లు, ధర విడుదల చేసిన కంపెనీ

KTR On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై ఛీటింగ్ కేసులు పెట్టాలి...జనవరి 21న నల్గొండలో రైతు ధర్నా చేస్తామన్న మాజీ మంత్రి కేటీఆర్, షాబాద్ రైతు దీక్షకు భారీగా తరలివచ్చిన అన్నదాతలు

Formula-E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం...ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు, గ్రీన్ కో ఎండీకి సైతం నోటీసులిచ్చిన ఏసీబీ

Share Now