IPL Auction 2025 Live

KTR On Amara Raja Battery: తెలంగాణ నుండి తరలిపోతున్న పరిశ్రమలు, కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టమని కామెంట్

అయితే తాజాగా అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటంపై స్పందించడం కేటీఆర్ ఇది చాలా బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు అని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

BRS KTR Questions CM Revanth Reddy on Amara Raja Battery Issue (X)

Hyd, Aug 11:  తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు గల్లా జయదేవ్‌కు చెందిన అమర రాజా కంపెనీ ముందుకొచ్చింది. అయితే తాజాగా అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటంపై స్పందించడం కేటీఆర్ ఇది చాలా బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు అని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమరరాజా సంస్థ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇదే నిజమైతే చాలా దురదృష్టకరం అని.... ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థంకాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడుతున్నాయని మండిడ్డారు కేటీఆర్.

గతంలో కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయిందని ఆ తర్వాత కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిందని ఇప్పుడు అమరరాజా కూడా వెళ్లిపోతానని చెబుతుంటే బాధగా ఉందని ఇది తెలంగాణ బ్రాండ్‌కు తీవ్ర నష్టం చేస్తుందన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతమాత్రం మంచిది కాదు అన్నారు. వీడియో.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్‌, 15న ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 

Here's Tweet:

ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలని, అమరరాజా సంస్థ తెలంగాణలో రూ. 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా వాళ్లను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డాం అని గుర్తు చేశారు.

దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్‌ప్లస్ స్టేట్‌గా ఉందని కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతుండటం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసేలా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని.... వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాలని సూచించారు.