KTR Visits Kaushik Reddy House: సీఎం రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం, ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేశారని కేటీఆర్ ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపీని డిమాండ్ చేశారు.

Hyd, Sep 14:  సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపీని డిమాండ్ చేశారు.

మా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి, అర్థరాత్రి వరకు తిప్పితే, తెలంగాణ ప్రజలు మొత్తం మా వెంట నిలిచారు అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే తెలంగాణ ప్రజల పౌరుషం చాటారు అని..నిన్న మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి, గాంధీకి రక్షణ కల్పించారు అన్నారు.గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు అని..హైదరాబాద్‌లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా నిర్వహించాం అని గుర్తు చేశారు

హైదరాబాద్‌లో ఉన్న ప్రజలు అందరూ మా వారే...ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు, ఇప్పుడు ఉండవు అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని, రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు అన్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు చేరావు? దిక్కుమాలిన PAC పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గు ఉండాలన్నారు. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెబుతారు అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి, పోలీసులే దాడి చేయించారు అని దుయ్యబట్టారు.తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్రలా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని...100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇంటికి చేరి, కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడు...పది మంది ఎమ్మెల్యేలు పోయారు, ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుంచి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారు ..హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్‌లో భయం మొదలైందన్నారు.  హైడ్రాపై ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ‌! హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు, హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన హైకోర్టు 

ఫిరాయింపులపై స్పీకర్‌ను కలిసి సుప్రీం కోర్టు తీర్పులను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేశామన్నారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసింది కౌశిక్ రెడ్డి అని గుర్తు చేశారు.బీఆర్ఎస్ పార్టీ తరఫున హైకోర్టు జస్టిస్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాం అని..పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండి అని మాట్లాడింది రేవంత్ రెడ్డి అన్నారు.

హైకోర్టు తీర్పు వచ్చిన రోజు అరికెపూడి గాంధీని PAC చైర్మన్‌గా నియమిస్తూ ప్రకటన చేశారు..ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే, పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు అన్నారు.   శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన గచ్చిబౌలి పోలీసులు 

ఈ రకమైన గుండాగిరి పదేళ్లలో ఎప్పుడూ లేదు...ఫ్యాక్షన్ సినిమాలు తలపించేలా వచ్చారు అన్నారు.రేపు ఏదైనా జరగరానిది జరిగితే, ఎవరు బాధ్యత వహిస్తారు?,ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికైనా చెప్పాలి, ఏ పార్టీలో ఉన్నారో..గ్యారెంటీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి హైడ్రామాలు చేస్తున్నారు అన్నారు. నీవంటి పనికిమాలిన ముఖ్యమంత్రులను చూశాం ..ఇవన్నీ తిరిగి రేవంత్‌కు చుట్టుకుంటాయని మండిపడ్డారు కేటీఆర్.



సంబంధిత వార్తలు