KTR Apologies To Womens: మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్, అక్కాచెల్లెళ్లను కించ పరిచే ఉద్దేశం లేదని కామెంట్

దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్..తన వ్యాఖ్యలతో మహిళలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు.

BRS leader KTR apologises for his break dance remarks on women

Hyd, Aug 16:  తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్..తన వ్యాఖ్యలతో మహిళలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు.

పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలవల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు. అక్కాచెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని తెలిపారు. దీంతో వివాదానికి పుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది.

గురువారం తెలంగాణ భవన్‌లో మాట్లాడిన కేటీఆర్..ఉచిత బస్సుల్లో కుట్లు, అల్లికలు మేం వద్దనట్లేదు. అవసరమైతే బ్రేక్ డ్యాన్స్ లు వేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం, దమ్ముంటే రాజీనామా చెయ్- అగ్గిపెట్ట హరీశ్ రావు అంటూ మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీల ఏర్పాటు, వీడియో

Here's Tweet:

దీంతో కేటీఆర్ కామెంట్స్‌ను తప్పుబట్టారు మంత్రి సీతక్క. బస్సుల్లో అల్లం, వెల్లుల్లి, కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటి..మహిళలను కించపరిచేలా కామెంట్ చేసిన కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ సైతం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్దం చేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ట్విట్టర్ ద్వారా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే చారం వ్యక్తం చేస్తున్నాను అని చెబుతూ నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని వివరణ ఇచ్చారు.