Jitta Balakrishna Reddy Passes Away: మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి, అనారోగ్యంతో మృతి చెందిన జిట్టా, ప్రజానేతగా గుర్తింపు

బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా. బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు.

BRS Leader , Telangana activist Jitta Balakrishna Reddy passes away

Hyd, Sep 6: మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా.

బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు. బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు జిట్టా. భువనగిరి నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

నల్గొండ జిల్లాలో ప్రధానంగా భువనగిరి ప్రాంత అభివృద్ధికి తనవంతు పాత్ర పోషించారు జిట్టా. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న ప్రజలను చూసి చలించిపోయి ప్రతి గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. నిత్యం ప్రజల కోసం పరితపించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా.

Here's Tweet:

అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు మెయింటెన్ చేశారు జిట్టా. ఇవాళ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. భువనగిరి శివారులోని మగ్దుంపల్లి రోడ్డులో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరగనున్నాయి.



సంబంధిత వార్తలు

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన