IPL Auction 2025 Live

Harish Rao On Rythu Runa Mafi: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్‌ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్

రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్‌ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Brs Mla Harish Rao demands cm revanth reddy , white paper on rythu runa mafi(X)

Hyd, Aug 17: రైతు రుణమాఫీ అంశం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. రుణమాఫీ చేసి దేశంలో ఏ సీఎం చేయని విధంగా సాహసం చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటూ కేవలం 54 శాతం రైతులకు రుణమాఫీ చేసిన పాపపు ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హరీశ్‌ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ రచ్చ చేస్తుంటే పాలకుడిగా రేవంత్ పాపాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక రైతు రుణమాఫీపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు హరీశ్ రావు. రుణమాఫీపై ఎక్కడైనా చర్చకు సిద్దం అని సవాల్ విసిరారు. ప్లేస్, డేట్, టైమ్ రేవంత్ రెడ్డి చెప్పాలి.. తెలంగాణలో ఎక్కడికైనా వెళ్లి రైతులను అడుగుదాం... రుణమాఫీ పూర్తిగా అయ్యిందో లేదో రైతులే చెబుతారన్నారు. రుణమాఫీ జరగలేదని మా కాల్ సెంటర్ కు 1.15లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చయాని.. రుణమాఫీపై శ్వేతప్రతానికి సిద్ధమా అని ప్రశ్నించారు.

రైఫిల్ పట్టుకుని రైతుల మీదకు వెళ్లిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొండి చేయడంలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్‌.. ఇది రేవంత్ చరిత్ర అన్నారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు భేషరతుగా రాజీనామా చేయాలని రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. పాలనలో రేవంత్ అట్టర్ ఫ్లాప్ అని, రాష్ట్రంలో చూస్తే హాస్టళ్లలో ఎలుకలు కొరుకుతున్నాయి.. డెంగ్యూ, మలేరియాతో ఆస్పత్రుల్లో మంచాలు దొరకట్లేవు అన్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యం పడకెక్కింది తెలంగాణ ఆగమైపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. టార్గెట్ కేటీఆర్ - హరీష్‌ రావు, కాంగ్రెస్ వ్యూహం ఇదేనా?, కాంగ్రెస్ కేడర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గీతోపదేశం ఏంటీ? 

రేవంత్ రెడ్డి తిట్లతో రైతుల ఖాతాలో కోట్ల రూపాయలు పడవని ...మమ్మల్ని తిట్లు తిడతవు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్ల మరిచిపోతావని సూటిగా ప్రశ్నించారు హరీశ్‌ రావు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి, మాట తప్పిన పాపం ఊరికే పోదని ...అది రాష్ట్రానికి చుట్టుకుంటుందేమోనని దేవుణ్ని నమ్మేవాళ్లు భయపడుతున్నారని తెలిపారు.



సంబంధిత వార్తలు

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్