Mallareddy Meets Etala Rajender: మ‌ల్కాజిగిరిలో ఈట‌ల‌దే గెలుపు! షాకింగ్ కామెంట్స్ చేసిన మ‌ల్లారెడ్డి, వివాహ వేడుక‌లో ఈట‌ల‌ను క‌లిసిన మ‌ల్లారెడ్డి (వీడియో ఇదుగోండి)

అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Minister-Mallareddy (Photo-Video Grab)

Hyderabad, April 26: బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా మల్లారెడ్డి (Mallareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ (Eetela rajender), మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ శుభకార్యంలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మల్కాజిగిరిలో ఈటలదే విజయం అంటూ జోస్యం చెప్పారు. అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

 

మేడ్చల్ పార్లమెంట్ పరిధిలో ఓ వివాహ వేడుకకు ఈటల రాజేందర్, మల్లారెడ్డి హాజరయ్యారు. ఆ ఫంక్షన్ హాలులో ఈటల దగ్గరకు వెళ్లిన మల్లారెడ్డి.. అన్నా అంటూ పలకరించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఆలింగనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ అభ్యర్థిని గెలుస్తావ్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈటలను మల్లారెడ్డి ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిన మల్లారెడ్డి.. ఆ పార్టీ ఓటమి అనంతరం హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరిగింది. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మల్లారెడ్డి కొట్టిపారేశారు. ఇప్పుడు, ఈటలతో ఆయన చేసిన కామెంట్స్ మళ్లీ సంచలనంగా మారాయి.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు