KTR Vs Bandi Sanjay: కవితకు బెయిల్..కాంగ్రెస్ విజయమన్న బండి సంజయ్ , బండి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్, చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి
ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వడంతో ఇవాళ జైలు నుండి విడుదల కానున్నారు కవిత. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల ముద్ధం నెలకొంది.
Hyd, Aug 27: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వడంతో ఇవాళ జైలు నుండి విడుదల కానున్నారు కవిత. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల ముద్ధం నెలకొంది.
కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ కష్టపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన..కాంగ్రెస్ న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయన్నారు. కవిత బెయిల్...కాంగ్రెస్ - బీఆర్ఎస్ విజయం అన్నారు. కవిత బెయిల్ కోసం రాజ్యసభకు పోటీ పెట్టలేదని అందుకే ఈ గిఫ్ట్ అన్నారు బండి సంజయ్. వైన్ అండ్ డైన్ క్రైమ్ లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కంగ్రాట్యులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు.
Here's Bandi Sanjay Tweet:
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్‌ను తప్పుబట్టారు కేటీఆర్. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తీరు ఉందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రిగా ఉన్న బండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని తెలిపారు. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలా స్పందించడమేంటని నిలదీశారు. ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా తీసుకోవాలని సుప్రీంను కోరారు.
Here's KTR Tweet:
ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే ఉన్న పదవిని వదిలేసి తెలంగాణ ఉద్యమం అంటూ నడుంకట్టేవాడే కాదు అని కొంతం దిలీప్ పేర్కొన్నారు.ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే 2006లోనే కేంద్ర మంత్రి పదవిని పూచికపుల్లలాగా వదిలేసేవాడే కాదు,ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే పార్టీ గెలుచుకున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలన్నిటికీ తెలంగాణ కోసం రాజీనామాలు చేయించేవాడే కాదు ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే 2009 ఎన్నికల్లో డీలా పడినా లేచి నిలబడి ఆమరణ నిరాహార దీక్ష చేసేవాడే కాదు అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్, రూ. 10 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు, ఐదు నెలల తర్వాత బయటకు రానున్న కవిత
Here's Tweet:
నిర్బంధాలూ, ఆంక్షలూ, అణచివేతలు తట్టుకుని 14 యేళ్లు ఉద్యమాన్ని నడపగలిగేవాడే కాదు...ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే అన్ని కుట్రలు, తంత్రాలు, డబ్బు సంచులు, లాబీయింగ్, ఉన్నప్పటికీ తెలంగాణ స్వరాష్ట్రమై విలసిల్లేదే కాదు ఆయన కాంప్రమైజ్ అయ్యే రకం అయితే రాజకీయ కక్ష సాధింపులో కన్నబిడ్డ ఆరు నెలలు జైల్లో మగ్గే పరిస్థితి తెచ్చుకునేవాడు కాదు అని వెల్లడించారు.