KCR Navagraha Yagam: కేసీఆర్ నవగ్రహ మహాయాగం, 18 నుండి జిల్లాల టూర్, ఎన్నికల్లో ఓటమి తర్వాత చేస్తున్న యాగం నేపథ్యంలో అందరి దృష్టి

రుణమాఫీపై రణం చేసేందుకు త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో నవగ్రహ మహాయాగం చేపట్టారు కేసీఆర్. సతీమణి శోభతో కలిసి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. ఇక తెలంగాణలో యాగం అనగానే గుర్తుకు వచ్చేది కేసీఆరే.

BRS President KCR performs Navagraha Yagam at erravelli farmhouse

Hyd, Sep 6: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈజ్‌ బ్యాక్. రుణమాఫీపై రణం చేసేందుకు త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో నవగ్రహ మహాయాగం చేపట్టారు కేసీఆర్. సతీమణి శోభతో కలిసి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. ఇక తెలంగాణలో యాగం అనగానే గుర్తుకు వచ్చేది కేసీఆరే.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 2015లో చండీయాగం చేపట్టారు కేసీఆర్. ఆ తర్వాత 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టారు. ఇప్పుడు నవగ్రహ మహాయాగం చేశారు కేసీఆర్.

ఈ నెల 11వ పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యచరణ సిద్ధం చేశారు. ఇదే అంశంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్.

Here's Tweet:

రుణమాఫీపై ప్రతీ జిల్లాలోనూ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు గులాబీ బాస్. ఈ నెల 18వ తేదీ నుంచి జల్లా పర్యటనలు ఉండనున్నట్లు తెలుస్తోండగా కేసీఆర్ యాగంకు సంబంధించిన వార్త తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.



సంబంధిత వార్తలు

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్‌ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్