KCR Is Back: రంగంలోకి దిగనున్న కేసీఆర్, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి, త్వరలో కీలక నేతలతో పలు రాష్ట్రాల టూర్!
ముఖ్యంగా రుణమాఫీ విషయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ టార్గెట్‌గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి అంతే ధీటుగా బీఆర్ఎస్ సైతం స్పందిస్తోంది. ఏకంగా హరీశ్ రావు కార్యాలయంపై దాడుల వరకు రాజకీయాలు వెళ్లగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు.
Hyd, Aug 17: తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా రుణమాఫీ విషయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ టార్గెట్‌గా కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి అంతే ధీటుగా బీఆర్ఎస్ సైతం స్పందిస్తోంది. ఏకంగా హరీశ్ రావు కార్యాలయంపై దాడుల వరకు రాజకీయాలు వెళ్లగా మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు.
అయితే గులాబీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రానున్నారట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొంటి ఎముక విరిగి చికిత్స నుండి కోలుకున్నారు కేసీఆర్. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటుండగా త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారట. ఇక కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని పార్టీ వర్గాల సమాచారంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది.
ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహరచన ఉండనుందట. ఇందుకోసం ప్రాంతీయ పార్టీల సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేయడానికి నేతలను సమాయత్తం చేయనున్నారట. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పర్యటించనున్నారట. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పాలకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పాపాలు చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్, రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్
సెప్టెంబరులో కేటీఆర్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నారు నేతలు. అనంతరం గులాబీ పార్టీ కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా పార్టీ కమిటీల ఏర్పాటుతో పాటు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టనున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ నేతలకే బూస్ట్ ఇవ్వనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.