KTR Slams CM Revanth Reddy: కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా?..కేటీఆర్ ఫైర్, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా అని ఎద్దేవా చేశారు.

BRS Working President KTR Lashes Out Congress Govt Over Farmers Issue( X)

Hyd, Sep 20: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు.ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా అని ఎద్దేవా చేశారు.

అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని దుయ్యబట్టారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు.

కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు...నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ? అన్నారు.   కాళేశ్వరం కమిషన్‌ మళ్లీ విచారణ, రేపటి నుండి 25 మందిని బహిరంగ విచారణ చేయనున్న కమిషన్

Here's Tweet:

 కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..?,420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు ?చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..?

అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..?ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన అన్నారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ…నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు...గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు అన్నారు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Trump Withdraws US from WHO: డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకుంటున్నాం, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళనున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ

Donald Trump Swearing In: వైట్‌హౌస్‌లోకి రీ ఎంట్రీ, అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం, భారత్ నుంచి కార్యక్రమానికి హాజరైన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Kakani Govardhan Reddy: వీడియో ఇదిగో, మళ్లీ వైసీపీ వస్తుంది..మీ గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Share Now