Casino in Hyderabad: క్యాసినో కలకలం, లీగల్ అంటున్న చికోటి ప్రవీణ్ రెడ్డి, జూదం మాటున విదేశాలకు నిధుల మళ్లింపు, పలువురు టూర్ ఆపరేటర్లపై విరుచుకుపడిన ఈడీ, చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు నోటీసులు

క్యాసినో వ్యవహారంలో (Casino in Hyderabad) కీలక సూత్రదారులు చికోటి ప్రవీణ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement Directorate (ED) కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు (ED conducts multiple raids) నిర్వహించింది.

File image of Enforcement Directorate | (Photo Credits: ANI)

Hyd, July 28: జూదం మాటున విదేశాలకు నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న అనుమానంతో పలువురు టూర్ ఆపరేటర్లపై హైదరాబాద్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విరుచుకుపడింది. క్యాసినో వ్యవహారంలో (Casino in Hyderabad) కీలక సూత్రదారులు చికోటి ప్రవీణ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (Enforcement Directorate (ED) కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు (ED conducts multiple raids) నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది.

బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్‌పై ఈడీ (ED) దాడులు తీవ్ర కలకలం రేపాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను వీరు ప్రత్యేక విమానాల్లో తరలించి అక్కడ క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలు సేకరించింది.

ఓటరు కార్డుపై ఈసీ కీలక నిర్ణయం, ఇకపై 17 ఏళ్లు నిండిన వారు ముందస్తుగా ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఎస్ఈసీ

సుమారు 20 గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు ప్రవీణ్‌ చికోటి నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. నేపాల్‌లో లీగల్‌గా క్యాసినో నిర్వహించినట్టు ఈడీ అధికారులకు ప్రవీణ్‌ తెలిపాడు. దీంతో ప్రవీణ్‌ ల్యాప్‌టాప్‌లో అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు అధికారులు. అలాగే పంటర్స్‌తో జరిపిన లావాదేవీలపై ప్రవీణ్‌ నుంచి వివరాలు సేకరించారు. హవాలా రూపంలో చెల్లింపులపై ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇక చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ( Chikoti Praveen, Madhav Reddy) ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారంపై నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ స్పందించాడు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈడి అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారపి సోమవారం మళ్లీ మళ్ళీ విచారణకు రమ్మన్నారని తెలిపారు. గోవా, నేపాల్ లో క్యాసినో లీగల్, నేను లీగల్ వ్యాపారమే చేశాను. నేను సామాన్యమైన వ్యక్తిని క్యాసినో వ్యవహారంలో ఈడీ రైడ్ చేసింది. ఈ విషయంలో ఈడీ అధికారులకు కొన్ని సందేహాలున్నాయి, అందుకే వాళ్ళు వివరణ అడిగారని ప్రవీణ్ తెలిపాడు.

ఐఎస్‌ సదన్‌లోని చికోటి ప్రవీణ్‌ ఇంట్లో అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సైతం చీకోటితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈడీ అధికారులను షాక్‌ తినేలా చేసినట్టు తెలుస్తోంది.

నేపాల్‌ క్యాసినోకు టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన 10 మంది సినీ తారలు పాల్గొన్నట్లు ఈడీ గుర్తించింది. అంతకుముందు వారితో ప్రమోషన్‌ వీడియోలు చేయించినట్లు తెలుస్తున్నది. జనవరిలో గుడివాడ గ్యాంబ్లింగ్ లోనూ ఆయన హస్తం ఉన్నట్లు తేల్చారు. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ క్యాసినోలకు పలువురిని తీసుకెళ్లినట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది.

క్యాసినో నేపథ్యంలో సినీ తారలతో ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఐఎస్‌ సదన్‌లోని ప్రవీణ్‌ ఇల్లు, కడ్తాల్‌లోని ఫాంహౌస్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ​క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్‌ వ్యవహారం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. ప్రవీణ్‌పై కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది.

బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో మాధవరెడ్డి ఇంట్లో ఉన్న ఓ కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్‌ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు కారు స్టిక్కర్‌పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ స్టిక్కర్‌ను తాను మూడు నెలల క్రితమే పడేసినట్టు స్పష్టం చేశారు. తానే పడేసిన స్టిక్కర్‌ను ఎవరో పెట్టుకుంటే నాకేంటి సంబంధం అని మంత్రి ప్రశ్నించారు.

ఓ రియల్టర్‌ను బెదిరించి రూ.30 లక్షలు గుంజిన కేసులో ప్రవీణ్‌ కొద్ది రోజులు జైల్లోఉన్నాడు. అప్పడు ఏర్పడిన పరిచయాలతోనే ప్రవీణ్‌ క్యాసినో నిర్వాహకుడిగా మారాడని అంటుంటారు. తొలినాళ్లల్లో క్రికెట్‌ బుకీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2017 అక్టోబర్‌లో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మారియట్‌పై దాడి చేశారు. దీపావళి నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్యాసినో గుట్టురట్టు చేశారు.

కేవలం మూడు రోజుల్లో రూ.80 లక్షలకు పైగా చేతులు మారింది. వారాసిగూడకు చెందిన సంజయ్‌కుమార్‌ ఈ శిబిరం ఏర్పాటు చేయగా... ప్రవీణ్‌ సహా నలుగురు కీలకపాత్ర పోషించి పోలీసులకు చిక్కారు. ఈ శిబిరంలో ప్రవేశించడానికి పేకాటరాయుళ్లు కనీసం రూ.2 లక్షలు చెల్లించి కాయిన్స్‌ (చిప్స్‌) తీసుకుని పేకాట టేబుల్‌పై కూర్చునేలా చేశారు. ఏడో అంతస్తు మొత్తాన్ని బుక్‌ చేసి... సూట్‌ రూమ్‌లో ఒక్కో టేబుల్‌పై 8 మంది కూర్చునేలా మొత్తం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు.