Kavitha CBI Investigation: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు సీబీఐ షాక్.. రేపు మరోసారి విచారించనున్న సీబీఐ అధికారులు?

సిబిఐ డిజి రాఘవేంద్ర వత్స నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది.

Kalvakuntla Kavitha | File Image

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. సిబిఐ డిజి రాఘవేంద్ర వత్స నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. ఆమెను ఐదుగురు సభ్యుల సిబిఐ అధికారుల బృందం విచారణ జరుపుతోంది. కల్వకుంట్ల కవిత నివాసానికి మొత్తం 11 మంది సిబిఐ అధికారులు వెళ్లారు.

లిక్కర్ కుంభకోణం కేసులో నిందుల స్టేట్‌మెంట్ ఆధారంగా సిబిఐ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.  నిందితుడు అమిత్ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగానే కవితను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మనీశ్ సిసోడియా, అమిత్ అరోరా, అభిషేక్ విషయంలో ఆమెను సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఫోన్ లో గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా పేలిన మొబైల్.. 13 ఏండ్ల బాలుడికి తీవ్ర గాయాలు.. మథురలో ఘటన

అయితే న్యాయవాదుల సమక్షంలోనే సిబిఐ బృందం ప్రశ్నిస్తుండటం ఇక్కడ గమనార్హం. కాగా కవిత స్టేట్‌మెంట్లను సిబిఐ అధికారులు రికార్డు చేస్తున్నారు.  కాగా రేపు మరోసారి కూడా కవితను విచారించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.  కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించి ఉంచారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న అనంతరమే కవిత విచారణకు హాజరయ్యారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif