
Mathura, Dec 11: ఉత్తరప్రదేశ్ లోని (Uttarpradesh) మథురలో (Mathura) దారుణం జరిగింది. రోజూలాగే మొబైల్ లో (Mobile) గేమ్స్ (Games) ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది (Exploded). ఈ ఘటనలో 13 ఏండ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి (Severely Injured). పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు బాలుడిని హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, పేలిన మొబైల్ ఎంఐ కంపెనీకి చెందినదిగా బాలుడి తండ్రి పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
