Dollar Boy Arrested: 139 మంది అత్యాచారం కేసు, డాలర్ బాయ్‌ని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు, ఆగస్టు 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో డాలర్‌ భాయ్‌పై యువతి ఫిర్యాదు

తనపై 139 మంది అత్యాచారం (139 rape case) చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అత్యాచార ఆరోపణలను డాలర్‌ భాయ్‌ ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో డాలర్‌ భాయ్‌పై యువతి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు (CCS police) పలువురిని అరెస్ట్‌ చేసి విచారించారు. ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు డాలర్ భాయ్‌ని అరెస్ట్ చేశారు.

TS police Logo

Hyderabad, Oct 23: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుని తప్పించుకు తిరుగుతున్నడాలర్‌ భాయ్‌ని (Dollar Boy Arrested) సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై 139 మంది అత్యాచారం (139 rape case) చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ అత్యాచార ఆరోపణలను డాలర్‌ భాయ్‌ ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 20న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో డాలర్‌ భాయ్‌పై యువతి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే సీసీఎస్‌ పోలీసులు (CCS police) పలువురిని అరెస్ట్‌ చేసి విచారించారు. ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు డాలర్ భాయ్‌ని అరెస్ట్ చేశారు.

కాగా.. తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దానిలో సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను సైతం వెల్లడించింది. పంజాగుట్టలో తనపై 139 మంది అత్యాచారం జరిపారని కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా తనతో డాలర్‌ భాయ్‌ చేయించాడని చెప్పి సదరు యువతి షాక్ ఇచ్చింది. తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది. తాను చెప్పినట్లు చేయకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించాడని సదరు యువతి వెల్లడించింది. ఫైనల్‌గా డాలర్ భాయ్‌పై సదరు యువతి కేసు కూడా నమోదు చేసింది.

పంజాగుట్ట 139 మంది రేప్ కేసులో ట్విస్ట్, డాలర్‌ బాయ్ ఒత్తిడి మేరకే వారి పేర్లు చేర్చానని తెలిపిన బాధిత యువతి, కేసుతో ఇతడికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్న పోలీసులు

2011 నుంచి ఇప్పటివరకు 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. కొన్ని సందర్భాల్లో తనపై గ్యాంగ్ రేప్‌లు కూడా జరిగాయని పేర్కొనడం సంచలనంగా మారింది. వీడియోలు, ఫొటోలు తీసి వేధింపులకు పాల్పడ్డారని కూడా పేర్కొంది. ఈ అత్యాచారలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఎట్టకేలకు ఈ కేసులో ఇవాళ డాలర్ భాయ్ ని సిపిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇందులో కీలకంగా మారిన డాలర్‌ బాయ్‌ని ఈ రోజు రిమాండ్‌కి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.