Hyderabad: హైద‌రాబాద్ వాసుల‌కు తీర‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు, డిఫెన్స్ భూముల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ర‌క్ష‌ణ శాఖ గ్రీన్ సిగ్న‌ల్

హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం పట్టణాలను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు.

Traffic (Photo Credit- PTI)

Hyderabad, March 01: హైదరాబాద్‌‌ – కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్– నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ (Elevated Corridors) నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ భూముల (Defense lands) మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల (Elevated Corridors) నిర్మాణానికి అనుమతించాలని లేఖను అందించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి శుక్రవారం అనుమతులు జారీ చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన కారిడార్ల నిర్మాణానికి అనుమతించినందుకు ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth reddy) కృతజ్ఞతలు తెలిపారు.

Indian Air Force: ఐఏఎఫ్‌ విమానంకు తప్పిన పెను ప్రమాదం, సాంకేతిక లోపంతో గంట సేపు గాలిలోనే చక్కర్లు, ఎట్టకేలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ 

హైద‌రాబాద్ నుంచి క‌రీంన‌గ‌ర్‌-రామ‌గుండం పట్టణాలను క‌లిపే రాజీవ్ ర‌హ‌దారిలో ప్యార‌డైజ్ జంక్షన్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీట‌ర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎక‌రాల భూమి అవసరమని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్‌-44)పై కండ్లకోయ స‌మీపంలోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామ‌ని, అందులో 12.68 కిలోమీట‌ర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీల‌కు, భ‌విష్యత్తులో డ‌బుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్‌, ఇత‌ర నిర్మాణాల‌కు మొత్తంగా 56 ఎక‌రాల ర‌క్షణ శాఖ భూములు బ‌దిలీ చేయాల‌ని ర‌క్షణ శాఖ మంత్రికి సీఎం విజ్ఙప్తి చేశారు.