CM Revanth Reddy: గుడ్ న్యూస్‌..తెలంగాణలో చార్లెస్ ష్యాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌, భారత్‌లో ఫస్ట్ టెక్నాలజీ సెంటర్‌ హైదరాబాద్‌లోనే

ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అందించారు. అమెరికన్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్యాబ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ అనంతరం ఈ ముఖ్యమైన నిర్ణయం, గుడ్ న్యూస్‌ని ప్రకటించారు.

Charles Schwab first Technology Development Centre in India(X)

America, Aug 8: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అందించారు. అమెరికన్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్యాబ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ అనంతరం ఈ ముఖ్యమైన నిర్ణయం, గుడ్ న్యూస్‌ని ప్రకటించారు.

డల్లాస్‌లోని ష్వాబ్ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరుగగా ష్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బోక్కా...ప్రభుత్వ సహకారంపై ప్రశంసలు గుప్పించారు. త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటిస్తామని హైదరాబాద్ సాంకేతిక ఆవిష్కరణలకు ప్రపంచ గమ్యస్థానంగా అభివృద్ది చెందుతుందన్నారు.

ఇక అనంతరం అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి డి.శ్రీధర్ బాబు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి మహాత్ముడికి నివాళులర్పించారు రేవంత్.

హైదరాబాద్‌ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే

Here's Tweet:

 మెటీరియల్‌ సైన్స్‌ రంగంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Here's Tweet:

ఎమర్జింగ్ ఇన్నొవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్‌ వెర్క్‌క్లీరెన్‌ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు.



సంబంధిత వార్తలు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య