Telangana Shocker: అందమే ఆమె శాపమైంది, సినిమాల్లో ఛాన్స్ పేరుతో అత్యాచారం, మోసపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాకం
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారానికి ఒడగట్టాడు. హైదరాబాద్ పుప్పాలగూడలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Hyd, Aug 1: అంతమే ఆమె పాలిట శాపమైంది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారానికి ఒడగట్టాడు. హైదరాబాద్ పుప్పాలగూడలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ పుప్పాలగూడలో నివాసం ఉంటున్న ఓ యువతి ఐటీ కారిడార్‌లోని సాప్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తోంది. ఆమె స్వస్థలం అనంతపురం. అందంగా ఉన్నావ్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ముగ్గులోకి దింపాడు వైజాగ్‌కు చెందిన సిద్ధార్థ్ వర్మ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండటంతో ఆ మోసగాడి మాటలు నమ్మింది. ముంబైలో దారుణం, చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల బాలికపై స్కూల్ టాయెలెట్లో వాచ్‌మెన్ అత్యాచారం
ఆ తర్వాత యువతి ఫోన్ నెంబర్ తీసుకుని ఓ రోజు డిన్నర్ పేరిట తాను ఉంటున్న ఇంటికి పిలిచాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ,ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి సిద్ధార్థ్ వర్మపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు, యువతిని మోసం చేసిన సిద్దార్థ్ వర్మ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.