TRS Agitations on Fuel Prices: ఇక సమరమే! పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుపై టీఆర్‌ఎస్ ఆందోళనలు, పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్, భారీ నిరసనలకు ప్లాన్ చేసిన టీఆర్ఎస్ శ్రేణులు

ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ భగ్గుమంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో జ‌ర‌గ‌నున్న ఈ నిర‌స‌న‌ల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోనున్నాయి.

CM KCR Speech (Photo-Twitter)

Hyderabad, March 23: ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ (TRS) భగ్గుమంది. పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), గ్యాస్ (Gas)ధరల పెంపునకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ (KCR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు (protests ) చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో జ‌ర‌గ‌నున్న ఈ నిTRSర‌స‌న‌ల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోవాల‌ని, నిర‌స‌‌నల‌ను హోరెత్తించాల‌ని ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్ప‌టికే యాసంగిలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వాదిస్తున్న కేసీఆర్‌ (KCR).. తాజాగా ధ‌ర‌ల పెరుగుద‌ల అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన‌ట్లుగా రాజకీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అటు వరుసగా రెండో రోజూ ధరల పెరుగుదలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల పాటు బ్రేక్ తీసుకున్న దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి చడీచెప్పుడు కాకుండా ధరల పెంపును ప్రారంభించేశాయి. బుధవారం కూడా లీటర్ పెట్రోల్ పై 90పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 72 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదు

ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు జీవనం రోజు రోజు భారంగా మారుతోంది.చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ బేసిక్ ధరతో పోల్చితే వసూలు చేసే ట్యాక్సులే (Taxes) అధికంగా ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నాయి.

Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, తొలివిడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ, గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి అనుమతి..

రాష్ట్రాలే అధికంగా ట్యాక్సు వసూలు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తుంటే… ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ రాష్ట్రాలు ప్రతి విమర్శ చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ (GST) పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. జీఎస్టీ పరిధిలో లేనందునే ధరలు పెరుగుతున్నాయన్న వాదన కూడా ఉంది. అయితే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం చెబుతోంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిలో మరో అయిదుగురు అరెస్ట్, ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు, వీడియో ఇదిగో..

Attack on Chilkur Temple Chief Priest: ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Astrology: ఫిబ్రవరి 23 నుంచి గురుడు స్వాతీ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం... లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు కనక వర్షంలా ఖాయం..

Astrology: ఫిబ్రవరి 19 నుంచి చంద్రుడు చంద్రుడు సింహరాశి లోకి ప్రవేశం,ఈ మూడు రాశుల వారికి కుబేరుడి అనుగ్రహం తో కోటీశ్వరులు అవడం ఖాయం... డబ్బు వర్షంలా కురుస్తుంది..

Share Now