CM KCR: మునుగోడు సభలో గర్జించిన కేసీఆర్, వందకోట్లతో కొనాలని చూస్తే, ఎడమకాలి చెప్పుతో కొట్టారు మా ఎమ్మెల్యేలు, మోదీ ఎందుకు ఇంత కిరాతకం..

అంతేకాదు ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారిన నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

CM KCR

మునుగోడు ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన  కేంద్రంలోని మోడీ సర్కార్ పై  తీవ్ర విమర్శలు చేశారు.  అంతేకాదు ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో  సంచలనంగా మారిన నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు

‘ఇవాళ నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని చెప్పి.. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావు లాంటివారు కావాలి రాజకీయాలకు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా.. వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టి తెలంగాణను కాపాడిన బిడ్డలు. వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్‌ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.

మరో ఈవెంట్లో చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్... "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ చిరు చమత్కారం! గరికపాటిపై తాజాగా చిరంజీవి పరోక్షంగా సెటైర్ వేసినట్టు భావిస్తున్న ఫ్యాన్స్

‘నరేంద్ర మోదీని అడుగుతున్నా నీకు ఇంకా. దేశంలో ప్రధాని పదవిని మించి పదవి ఇంకా లేదు కదా. ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఎందుకు ఈ కిరాతకం. ఎందుకీ అరాచకం. దేశం కోసం, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నరు. మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నరు. వాళ్లు ఆఫర్‌ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరు ఉన్నరో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఆలోచించాలని కోరుతున్నా’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.